Allaripriyudu - aho oka manasuki nede

చిత్రం: అల్లరిప్రియుడు
గానం: sp బాలసుబ్ర్యమణ్యం, చిత్ర 
లిరిక్స్: వేటూరి సుందర రామ్మూర్తి

aho oka manasuki nede - song telugu lyrics

అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: మాటా పలుకు తెలియనిది
మాటున ఉండే మూగమది
కమ్మని పలుకుల కావ్యమయే
కవితలు రాసే మౌనమది ...
రాగాల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శృతి లయ తెలిసిన ఊసులకి
స్వరములు కూర్చే భావమది ...
ఋతువుల రంగులు మార్చేది
కల్పనా కలిగిన మధుభావం
బ్రతుకున పాటగా కదిలేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి
మనస్సనేది ...

అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం: రూపులకెన్నడు దొరకనిది 
రంగు రూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు 
స్వప్నాలెన్నో చూపినదీ ... 
వెచ్చని చెలిమిని పొందినది 
వెన్నెల కలువల నిండు మది ... 
ఆశలు తీరని రాతిరికి 
బాటలు చూపే నేస్తమది 
చేతికి అందని జాబిలిలా 
కాంతులు పంచె మణిదీపం 
కొమ్మల చాటున కోయిలలా 
కాలం నిలిపే అనురాగం 
అడగని వరములు కురిపించి 
అమృతవర్షిణి అనిపించి 
అమూల్యమైన పెన్నిధి 
శుభోదయాల సన్నిధి 
మనస్సనేది 

అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతికా జనించు రోజు
అహో ఒక మనసుకి నేడే పుట్టినరోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు

other songs from allaripriyudu cinema





Post a Comment