allaripriyudu - andamaa nee peremiti andamaa

చిత్రం: అల్లరి ప్రియుడు
లిరిక్ రైటర్: వేటూరి సుందర రామ్మూర్తి 
తారాగణం: రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల
andama nee peremiti andama telugu lyrics

పల్లవి: అందమా... నీ పేరేమిటి అందమా... 
అందమా... నీ పేరేమిటి అందమా... 
ఒంపుల హంపీ శిల్పమా బాపూ గీసిన చిత్రమా 
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.... 

పరువమా... నీ ఊరేమిటి పరువమా... 
పరువమా... నీ ఊరేమిటి పరువమా... 
కృష్ణుని మధురానగరమా కృష్ణాసాగర కెరటమా 
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.... 
చరణం: ఆ... ఆహ ఆహ ఆహాహహహా.... 
ఆ... ఆహ ఆహ ఆహాహహహా.... 

ఏ...రవీంద్రుని భావమో గీతాంజలీ కళ వివరించె 
ఎండ తాకని పండువెన్నెల గగనమొలికె నాకన్నులా 
ఎంకిపాటల రాగమే గోదారి అలలపై నిదురించే 
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతునా 
సంగీతమా ఆ ఆ.... 
ఈ నింగిలో ఓ ఓ.... 

విరిసిన స్వరములే ఏడుగా... 
వినబడు హరివిల్లెక్కడా... 
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.... 

అందమా... నీ పేరేమిటి అందమా... 
తెలుపుమా...నీ ఊరేమిటి పరువమా... 

చరణం: భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే 
హాయిరెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా 
తుమ్మెదడగని మధువులే చెలిసాకి వలపులే చిలికిస్తే 
మాయజగతికి ఏఖయామో మధురకవిత వినిపించడా 
ఓ కావ్యమా... ఆ ఆ... 
ఈ తోటలో.... ఓ ఓ ... 

నవరసపోషణే గాలిగా... 
నవ్వినపూలే మాలగా... 
పూజకే... సాధ్యమా...తెలుపుమా 

అందమా... నీ పేరేమిటి అందమా... 
అందమా... నీ పేరేమిటి అందమా... 
ఒంపుల హంపీ శిల్పమా బాపూ గీసిన చిత్రమా 
తెలుపుమా.. తెలుపుమా.. తెలుపుమా.... 

cheppakane chebuthunnadi

aho oka manasuki nede

Post a Comment