Allaripriyudu- cheppakane chebuthunnadi

chitram: allaripriyudu

lyric riter: veturi sundara rammurthy

Actors: Rajasekhar, Ramyakrishna, Madhubala

cheppakane chebuthunnadi song telugu lyrics

పల్లవి: కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను 
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను 
తడియారని పెదవులపై 
తొణికిన వెన్నెల మెరుపులు 
చెప్పకనే..చెప్పకనే.. 
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని 
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని.. 
చరణం: చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే 
మోహపు తెరలిక తొలిగేనా...అహా..అహా..అహ 
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే 
ఆశల అల్లరి అణిగేనా..అహా..అహా..అహా 
పదాలతోనే వరించనా 
సరాగ మాలై తరించనా 
స్వరాలతోనే స్పృశించనా 
సుఖాల వీణ శృతించనా 
ఆ వెన్నెల నీ కన్నుల 
రేపెక్కిన ఆ కోరిక 
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే....ఏ..ఏ..ఏ 
చెప్పకనే..చెప్పకనే.. 
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని 
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని 
చరణం : తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం 
యవ్వన గిరులను తడిమెననా 
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం 
మదనుడి మలుపులు తెలిసెననీ 
తెల్లారనీకే ఒయ్యారమా 
అల్లాడిపోయే యీ రేయిని 
సవాలు చేసే శృంగారమా 
సంధించమాకే ఓ హాయిని 
ఆ మల్లెల కేరింతలు 
నీ నవ్వుల లాలింతలు 
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే 
చెప్పకనే..చెప్పకనే.. 
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని 
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని


Post a Comment