america ammai-padana telugu pata


చిత్రము: అమెరికా అమ్మాయి
పాడనా తెలుగు పాట
పరవసమై మీ ఎదుట మీ పాట
 పాడనా తెలుగు పాట
కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో
మావుల తోపులా మోపుల పైన మసలే గాలుల గుసగుసలు
మంచి ముత్యాల పేట మధురామృతాల తేటా
ఒక పాట
పాడనా తెలుగు పాట
పరవసమై మీ ఎదుట మీ పాట
 పాడనా తెలుగు పాట
చరణం : త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు 2
తనివితీర వినిపించినది
నాడు నాడుల కదిలించేది  వాడ వాడల వినిపించేది
చక్కని మాటల మూట చిక్కని తేనెల ఊట
ఒక పాట
పాడనా తెలుగు పాట
చరణం: ఒళ్లంత వయ్యారి కోకా  కళ్ళకు కాటుక రేఖా 2
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమ బొట్టూ
ఘల్లు ఘల్లునా కడియాలాందలు అల్లనల్లనా నడియాడే
తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట 
ఒక పాట
పాడనా తెలుగు పాట
పరవసమై మీ ఎదుట మీ పాట
 పాడనా తెలుగు పాట

Post a Comment