Amma dongaa - palagummi viswanadham

అమ్మదొంగా నిన్ను చూడకుంటే 
లిరిక్స్ & మ్యూజిక్: పాలగుమ్మి విశ్వనాధం
గానం: వేదవతి ప్రభాకర్
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కాలమని నవ్వుతూ
కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..

కధ చెప్పేదాకా కంట నిదుర రాక
కధ చెప్పేదాకా నీవు నిదుర పోక
కధ చెప్పేదాకా నన్ను కదలనీయక
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..

ఎపుడో ఒక అయ్యా నిన్నెగరేసుకు పోతే
నీవువలేక నా మనసు నీవైపే లాగితే 2
గువ్వా ఎగిరిపోయిన గూడు నిదురపోవునా 2
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..

నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు
నవ్వితే నీకళ్ళు ముత్యాలు రాలు
ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు
కలతలు కష్టాలు నీ దొరికే రాక
కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..
అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ..




తెలుగు ప్రైవేట్ సాంగ్ అమ్మదొంగా  - పాలగుమ్మి విశ్వనాధం 

Post a Comment