arjun reddy-madhurame


చిత్రం: అర్జున్ రెడ్డి
పాడినది: సమీరా భరద్వాజ్
మ్యూజిక్ కంపోజ్: రాధన్
లిరిక్ రైటర్: శ్రేష్ఠ
తారాగణం: విజయ్ దేవరకొండ, షాలిని పాండే

మధురమే ఈ క్షణమే  ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురమే లాలనయే
మధురమే లాహిరీలే
మధురమే లలితమే
మధు పవనం వీచి 2
పరువమే మైమరచిందిలే

చరణం: కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే
మోహం తన్మయమంది శ్వాసించే గంధాలే
ఊరించే రుచులన్నీ మరిగి
ఉడికించే తాపాలే
ఉప్పెంగే ఊపిరి సెగలూ
కవ్వించే దాహాలే
మౌనముగా మధువులా జడిలోనా
పులకించే ప్రాణాలే

మధురమే ఈ క్షణమే  ఓ చెలి
మధురమే ఈ క్షణమే
చరణం: వీచే గాలులు దాగి 
చెప్పేనే గుస గుసలే 
చూసే ముసి ముసి నవ్వులు 
చేసే బాసలనే 
వశమై ఆనందపు లోగిట 
అరుదెంచి ఆకాశం 
సగమి ఈ సాగరమందే 
అగుపించే ఆసాంతం 
తీరం ముడివేసిన దారం 
తీర్చే ఎద భారాలే 

మధురమే ఈ క్షణమే  ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురమే లాలనయే
మధురమే లాహిరీలే
మధురమే లలితమే
మధు పవనం వీచి 2
పరువమే మైమరచిందిలే

Post a Comment