Enki paatalu - gunde gonthukalona

Enki paatalu - gunde gonthukalona

రైటర్: నండూరి సుబ్బారావు

గుండె గొంతుకలోన కొట్లాడుతాది
కూసుండనీదురా కూసింతసేపు 2

నాకాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది 2
ఎళ్లి మాటాడిస్తే  ఇసిరి కొడతాది
గుండె గొంతుకలోన కొట్లాడుతాది
కూసుండనీదురా కూసింతసేపు 2

కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది
దగ్గరగా కూకుంటే అగ్గి సూస్తాది 2
ఈడుండమంటాది ఇల్లు దూరిపోతాది
యిసిగించి యిసిగించి ఉసురోసుకుందీ...
గుండె గొంతుకలోన కొట్లాడుతాది
కూసుండనీదురా కూసింతసేపు 2

మందో మాకో ఎట్టి మరిగించినాది
వల్లకుందామంటే పాణమాగదురా
గుండె గొంతుకలోన కొట్లాడుతాది
కూసుండనీదురా కూసింతసేపు 2





gunde gonthukalona telugu script


other songs of enki paatalu - nanduri subbarao

enki vanti pilla


Post a Comment