fida-edo jaruguthondi


చిత్రం: ఫిదా
లిరిక్ రైటర్:సిరివెన్నెల సీతారామ శాస్త్రి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
ఐనా మనసు దాన్ని పోల్చలేకున్నది
తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది
ఐనా చేయి చాచి అందుకోకున్నది
రమ్మంటున్నా పొమ్మంటున్నా
వస్తు ఉన్నా వచ్చేస్తున్నా
ఎదో జరుగుతోంది ఎదలో అలజడి
ఎదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఎదో జరుగుతోంది ఎదలో అలజడి
ఎదో అడుగుతోంది ఎదరే నిలబడి
గుండెలో ఇదేమిటో కొండంత ఈ భారం
ఉండనీదు ఊరికే ఏ చోట ఏ నిమిషం
వింటున్నావా నా మౌనాన్ని
ఏమో ఏమో చెబుతోంది
ఎదో జరుగుతోంది ఎదలో అలజడి
ఎదో అడుగుతోంది ఎదరే నిలబడి 2
కరిగిపోతూ ఉన్నది ఇన్నాళ్ల ఈ దూరం
కదలిపోను అన్నది కల లాంటి ఈ సత్యం
నా లోకంలో అన్ని ఉన్న ఎదో లోపం నువ్వే నెమో
ఆ పై దూరం ఎం లేకున్నా సందేహం లో ఉన్నానేమో
ఎదో జరుగుతోంది ఎదలో అలజడి
ఎదో అడుగుతోంది ఎదరే నిలబడి
తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
ఐనా మనసు దాన్ని పోల్చలేకున్నది
ఎదో జరుగుతోంది ఎదలో అలజడి
ఎదో అడుగుతోంది ఎదరే నిలబడి

Post a Comment