fida-song - oosupodu


చిత్రం: ఫిదా

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలానీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయి లేదు సోలానీదు
వీడిపోదు చేరిరాదు
చింత పోదు నాకిలా ఏమిటో
నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతన
నీ వైపు రావాలనే ఆలా ఉరుకుతోందే
ఆగేదేనా అరే ఈ ఆలోచన
నీ తలపులే వదలవేం నన్ను నిదురలోను
ఆ మరపున  తెలియక నన్నే వెతికినాను
వల్ల కాదు పాలుపోదు ఆగనీదు సాగనీదు వెంటరాదు
నాకిలా ఏమిటో
వేళ కాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చుకోదు చెంత లేదు
నాకిలా ఏమిటో 
నానుండి నా ప్రాణమే ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతన
నీ వైపు రావాలనే ఆలా ఉరుకుతోందే
ఆగేదేనా అరే ఈ ఆలోచన
నీ తలపులే వదలవేం నన్ను నిదురలోను
ఆ మరపున  తెలియక నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలవనీదు
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులే కలలుగా
నన్నే తరుముతాయే
ఆ కలవరం మెళకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలవనీదు
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే 2
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో

Post a Comment