Jai lavakusa - dochestha

చిత్రం: జై లవకుశ

కృష్ణ ముకుంద మురారి 2
పల్లవి: మీ కష్టాలన్నీ దోచేస్తా కన్నీళ్ళన్నీ దోచేస్తా
చీకు చింత దోచేస్తా చీకటినంత దోచేస్తా
భయాలన్నీ దోచేస్తా వారాలన్నీ దోచేస్తా
అప్పు సొప్పు దోచేస్తా  ఆపదాలన్నీ దోచేస్తా
ఏఏ ఓసి బాబాయ్ ఏఏ ఓసి అత్తాయి
మీ చేతిలో దాగిన వంకర గీతను నుదుట రాసిన వంకర రాతను
వెంట వెంట పడి ఎత్తుకెళ్ళి పోదా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధను దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా
చరణం: కల్లా కపటం లేని పిల్లాడినై వస్తా నే వస్తా
మీరెళ్ళే దారుల్లోని ముళ్ళన్నిటినీ  ఏరేస్తా పారేస్తా
సంద్రం లోని ఉప్పు ని మొత్తం చదువుల్లోని తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చని మొత్తం కూరలలోని పుచ్చులు మొత్తం
దేశం లోని చిచ్చులు మొత్తం మాయం చేసేస్తా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధను దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా
చరణం: రాముడి గుణమే కలిగిన క్రిష్నయ్య ల వస్తా నే వస్తా
చీరల బదులు మీలో చెడు లక్షణాలే  లాగేస్తా  లాగేస్తా
నవ్వుల మాటున ఏడుపులన్ని  ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ స్వాహా చేసేస్త
రంగుల మాటున రత్నాలన్నీ మాటల మాటున మర్మాలన్నీ
సాయం మాటున స్వాహా లన్ని సఫా చేసేస్తా
జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధను దోచేస్తా
చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా



Post a Comment