jai lavakusa-nee kallalona


చిత్రం: జై లవకుశ
నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా
నీ నవ్వు లోని వేడుక ఓ మెరుపు వెలుగు కాదా
నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా
ఆ వానజల్లు లోన నేను ఝల్లుమంటూ తడిసిపోదా
తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఆ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా జంట నువ్వు చేరిక దారమల్లే రాగ
నీ నీలి కురుల నుండి ఓ పూలగాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి తేలి తేలి పోయా
అసలు చందమామ నువ్వే అంటూ నేలమీద వాలిపోయా
దగ దగ నీ సొగసులోని దగ
భగ భగ భగ భగ పెంచింది పడచు పగ
దగ దగ నీ సొగసులోని దగ
భగ భగ భగ భగ పెంచింది పడచు పగ
నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
మెడవంపులోన నునుపు గాయానికి కారం పోస్తే
దారుణంగా దగ్గరై ఉధృతంగా ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
దగ దగ నీ సొగసులోని దగ
భగ భగ భగ భగ పెంచింది పడచు పగ  2



Post a Comment