Naa autograph - mounamgane edagamani

చిత్రం: నా ఆటోగ్రాఫ్
మ్యూజిక్: ఎం ఎం కీరవాణి
రచన: చంద్రబోస్
గానం: చిత్ర
తారాగణం: రవితేజ, భూమిక,గోపిక
mounamgane edagamani song telugu lyrics

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

చరణం: దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దారికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధ పడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగెచెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనందనిధి ఉన్నది
కష్టాలవారధి దాటినవారికే సొంతమవుతుంది
తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

చరణం: చెమటనీరు చిందగా నుదిటిరాత మార్చుకో
మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరిరాతలు బ్రహ్మె రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరిలించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

నా ఆటోగ్రాఫ్ - మౌనంగానే ఎదగమని


Post a Comment