ninnu kori - unnatundi

చిత్రం: నిన్ను కోరి
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

నేనా నేనా ఇలా నీతో ఉన్నా 
అవునా అవునా అంటూ ఆహ ఆన 
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నన్ను హత్తుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే 
ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

చరణం: ఏ దారం ఇలా లాగిందో మరి 
నీ తోడై చెలీ ... పొంగిందే మది 
అడిగి పొందినది కాదులే 
తనుగా దొరికింది కానుక 
ఇకపై సెకండు కొక వేడుక 
కోరే కల నీలా 
నా చెంత చేరుకుందిగా 

హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నన్ను హత్తుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే 
చరణం: ఆనందం సగం ... ఆశ్చర్యం సగం 
ఏమైనా నిజం ... బాగుంది నిజం 
కాలం కదలికల సాక్షిగా 
ప్రేమై కదిలినది జీవితం 
ఇకపై పదిలమే నా పాదం 
నీతో ఆటో ఇటో ... 
ఏవైపు దారి చూసినా 

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందే
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలే నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా ఇలా నీతో ఉన్నా 
అవునా అవునా అంటూ ఆహ ఆన 
హే మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు 
ముచ్చటగా నన్ను హత్తుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే 
చుక్కలు చూడని లోకం లోకి 
చప్పున నన్ను తీసుకుపోయే 
ఓయ్ ఓయ్ ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే 

Post a Comment