vaana sirimalle vaana

చిత్రం: వాన
లిరిక్ రైటర్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
తారాగణం: వినీ రాయ్, మీరా చోప్రా
sirimalle vaana telugu lyrics

సిరిమల్లె వాన పడుతోంది లోన 
కనిపించదే కంటికి 
వడగళ్ళ వాన ఉరిమింది మీనా 
వినిపించదే జంటకి 
తడిసే తరుణాన గొడుగై నే లేనా.. సిరిమల్లె 
సిరిమల్లె వాన పడుతోంది లోన 
కనిపించదే కంటికి 

వల అనుకోనా వలపనుకోనా 
కలిపిన ఈ బంధం 
వలదనుకున్నా వరమనుకున్న 
తమరికి నే సొంతం 
చినుకై వచ్చావే వరదై ముంచావే.. సిరిమల్లె 
సిరిమల్లె వాన పడుతోంది లోన 
కనిపించదే కంటికి 

చిలిపిగా ఆడి చెలిమికి ఓడి 
గెలిచా నీపైన 
తగువుకి చేరి తలపుగ మారి 
నిలిచా నీలోన 
మనసే ఈ వింత మునుపే చూసిందా.. సిరిమల్లె 
సిరిమల్లె వాన పడుతోంది లోన 
కనిపించదే కంటికి 
వడగళ్ళ వాన ఉరిమింది మీనా 
వినిపించదే జంటకి 


Post a Comment