vasantham jampanduve

చిత్రం: వసంతం
లిరిక్ రైటర్: వేటూరి సుందర రామ్మూర్తి


జాంపండువే దోర జాంపండువే పూచెండువే మల్లె పూచెండువే 

నీపాల బుగ్గ ఎర్రమొగ్గలేసే నా మనసున తైతక్క 
రవి చూడని రవికని చూసే నా వయసుకి తలతిక్క 
జాంపండునీ దోర జాంపండునీ పూచెండువే మల్లె పూచెండునీ 


ఊగింది ఉగింది నా మనసు ఊగింది 
నీ కంటి రెప్పల్లో అవిఏం చిటికెలో అవిఏం కిటుకులో 
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది నీ నడుమ 
ఒంపుల్లో అవి ఏం కులుకులో అవి ఏం మెళికలో 
ఇది పంచదార చిలక అంచులన్ని కొరక మీదికొచ్చె వాలమాక 
ఓయ్ చందనాల చినుక కుందనాల మొలక కోకడాబు కొట్టమాక 
నువ్వే నేనుగా తిరిగా జంటగా 
నిప్పే లేదుగా రగిలా మంటగా ||జాంపండువే|| 


ఒళ్ళంత తుళ్ళింతై చెమటెంత పడుతున్నా 
ఆ చెమట చేరనిచోటు చూపించవే అది చూపించవే 
కళ్ళంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా 
ఆ చెమట చేరనిచోటు ఈ పెదవులే వణికే పెదవులే 
నువ్వు ఆడసోకు చూపి ఈడకొంత దాచి కుర్రగుండె కోయమాక 
నన్ను కౌగిలింతలాడగ కచ్చికొది త్వరగా కన్నిసైగ కోరమాక 
మరి ఏముందిగా చొరవే చేయగా 
తరుగేపోదుగా ఒళ్ళో చేరగా ||జాంపండువే|| 
నా పాలబుగ్గ ఎర్రబుగ్గ లేస్తే నీ మనసున తైతక్క 
రవి చూడని రవికని చూస్తే నీ వయసుకి తలతిక్క ||జాంపండువే|| 


vasantham jampanduve

Post a Comment