vasntham godaaralle

చిత్రం; వసంతం
లిరిక్ రైటర్: కులశేఖర్
గోదారల్లే పొంగేనమ్మా నాలో సంతోషం

గోదారల్లే పొంగే నాలో సంతోషం గోరింటల్లే పూచే నాలో ఆనందం 
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ 
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస 
కలహంస నడకల్లోన అందాల హైలస్సా 
నేడే తెచ్చిందమ్మా మల్లెల వాసంతం 
నిండా నిండిందమ్మా నాలో సంగీతం 

గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే 
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే 
సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది 
రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల 
రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా ||గోదారల్లే|| 


గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే 
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే 
సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి 
గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం 
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం ||గోదారల్లే|| 

vasntham godaaralle

Post a Comment