Awara - Chiri chiru chiru chinukai kurisave song Telugu Lyrics
Singers: Haricharan, Thanvi
Music: Yuvan Sankar Raja
Lyric writer: Chandrabose
Actors: Karthi & Thamanna
Singers: Haricharan, Thanvi
Music: Yuvan Sankar Raja
Lyric writer: Chandrabose
Actors: Karthi & Thamanna
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే
నువ్వే ప్రేమబాణం నువ్వే ప్రేమగోళం
పువ్వై నవ్వగానే గాలై ఎగిసెను ప్రాణం
చై చై చెలిమిని చై అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే
దేవత... తనే ఒక దేవత
ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనేకదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడేవేళ
గుండెల్లోనా మెరుపే మెరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళు ముద్దుల్తోనే తడిమేయాల
చెంగు చెంగు అడుగుల్లోనే మువ్వైమది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చై చై చెలిమిని చై అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
తోడుగా ప్రతిక్షణం వీడక
అనుక్షణం ఆమెతో సాగనా ఆమెనా స్పందన
నేలపై పడెయ్యక నీడనే
చక చక చేరనా ఆపనా గుండెలోచేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయంలేక కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తను వింటూ ఉందే... తీయగా వేధిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే
చై చై చెలిమిని చై అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయావే